మన జీవితంలో అప్పుడప్పుడు జరిగిన హస్యాస్పద సంఘటనలను తలచుకొంటే భలే నవ్వొస్తుంది కదా!
అలాంటి సంఘటన ఒకటి ఇప్పుడు మీరు చదవబోతున్నారు.
గత ఏడాది వేసవిలో మా మరదలితో పాటు శ్రీశైలం వెళ్ళాను.అక్కడ గుడి బయట మేము ఇద్దరం నడుస్తూ వెళ్తుండగా, ఒక వృద్దుడు(బిచ్చగాడు) వచ్చి చిల్లర అడిగాడు.
చిల్లర లేదన్నాను.
"ఎంత ఉంది?" అన్నాడు.
"500 రుపాయలు వుంది" అన్నాను.
వెళ్ళిపోతాడనుకొంటుడగా,"నేనిస్తాను" అన్నాడు.
గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టయింది.
నా దగ్గర 500 నోటు లేదు.
అతడు ఏదో గొణుక్కొంటుడగానే త్వరత్వరగా అక్కడ్నుంచి వెళ్ళిపోయాము.
ఇక చూడండి రెండ్రోజులు మా మరదలు నన్ను ఏడిపిస్తుంటే....
ఏమీ అనలేక మ్మ్.....
ఇంకా ఏం చెప్పమంటారు?
2 comments:
bagundi ravi.. nee anandam
Ravi nenu kuda kurnool vaadine. Asalu nuvu valla number ivvu velli kummeddam. Alanti vallu kurnool lo thagilaarante naaku chaala badha gaa vundhi.
Post a Comment