Wednesday, February 13, 2008

వీళ్ళేం మనుషులు

ఎవరికైనా ఏదైనా విలువైన వస్తువు దొరికితే ఏం చేస్తారు? వాళ్లే సొంతం చేసుకోవడం మామూలుగా జరిగే విషయం. కానీ కొంతమంది ఆ వస్తువును పోగుట్టుకొన్నవాళ్ళకి అందచేయాలనుకొంటారు.
కానీ వాళ్ళుకొంచెం కూడా కృతజ్ఞతాభావం చూపకపోతే.....పైగా తిరిగిచ్చిన వాళ్ళపైనే అనుమానపడితే.....ఎలా వుంటుంది?

హలో ఫ్రెండ్స్! నాకెదురైన ఇలాంటి అనుభవం చూడండి.

అది కర్నూల్ సిటీ. ఒకరోజు సాయంత్రం మా ఫ్రెండ్ ఆటోలో వెళ్తుండగా అతడికి ఒక సెల్ ఫోన్ దొరికింది. అతనికి ఏం చేయాలో తోచక దాన్ని స్విచ్ ఆఫ్ చేసాడు. వెంటనే నాకు ఫోన్ చేసి విషయం ఆఫ్ చేసాడు. వెంటనే నాకు ఫోన్ చేసి చెప్పాడు. "సర్లే నీ పని పూర్తిచేసుకుని వచ్చేయ్,తర్వాత చూద్దాం" అని చెప్పాను.మేము వుండేది కర్నూల్ శివారు గ్రామంలో.అతడు తన పని పూర్తి చేసుకుని వచ్చాడు. అప్పటికి సమయం 10 గంటలు దాటింది. వెంటనే స్విచ్ ఆన్ చేసి చూస్తే ఒక మెసేజ్ వచ్చింది, "ఫోన్ దొరికితే ఇవ్వండి సర్ ప్లీజ్" అని.మేము ఆ నంబరుకి ఫోన్ చేసి, రేపు కర్నూల్లో కలిస్తే ఇస్తామని చెప్పాను. వాళ్లు మరుసటి రోజు ఫోన్ చేసి "ఎక్కడికి రావాల"ని అడిగారు. నేను సరిగానే అడ్రస్ చెప్పినా వాళ్ళు కన్ ఫ్యూజ్ అయి చివరికి ఎలాగో వచ్చారు.
తర్వాత ఏం జరిగిందటే......
ఒక వ్యక్తి మేము నిలబడి వున్న చోటికి వచ్చాడు.
నా చేతిలో సెల్ చూసి "దొరికిందా?" అని అడిగాడు.
"మీదేనా?" అని అడిగాను.
"అవును" అన్నాడు.
"ఆ అమ్మాయి ఎక్కడ" అని అడిగాను.
అదే క్షణంలో ఆ అమ్మాయి, వాళ్ళ నాన్న వచ్చారు.
"అదిగో" అంటూ ఆమెను చూపించాడు.
సెల్ ఆ అమ్మాయి చేతికిచ్చాను.
"థాంక్స్" అని చెప్పింది.
అప్పుడు వాళ్ళ నాన్న ఏం అన్నాడంటే.......
"మీరు అంత లేటుగా ఎందుకు ఫోన్ చేశారు?" అని.
వాళ్ళ అనుమానపు ప్రశ్నతో మనసు చివుక్కుమంది.
"దొరికింది మా ఫ్రెండ్ కి అందుకే" అనిచెప్పాను.
ఎటువంటి కృతజ్ఞతాభావం లేకపోగా....
ఒక అనుమానపు ప్రశ్నవేసి మరీ వెళ్ళారు.
ఒక్క క్షణం...."మనుషులు ఇలా కూడా ఉంటారా?" అనిపించింది.
కానీ ఫ్రెండ్స్,
దీన్ని చదివి 'ఎవరి వస్తువులు దొరికినా ఇవ్వకూడదు." అని అనుకోవద్దు, ప్లీజ్.
ఇది కేవలం పై సంఘటనలో ఎదురైన లాంటి వాళ్ళ లో మార్పుకోసం మాత్రమే.

No comments: